*మీ అందరి ఆశీర్వాదాలు కారణంగానే నేను టిపిసిసి అధ్యక్షుడిని అయ్యాను* *నిజామాబాద్ కు స్టేడియం మహిళ కళాశాల ఇంజనీరింగ్ కళాశాలకు ప్రపోజల్స్* *టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్*
నిజామాబాద్ అక్టోబర్ 5 (నిఘానేత్రం ప్రతినిధి):పత్రిక విలేఖరులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరి ఆశీర్వాదాలు కారణంగానే నేను పార్టీ అధ్యక్ష పదవికి చేరుకున్నాను అని టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విలేకరులతో చిట్ చాట్ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం వంశీ హోటల్ నందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు యిచ్చారు.. రాష్ట్రంలో నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలు వెనుకబడిపోయాయని వాటి అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఇంకొక మెడికల్ కాలేజ్ ని CSI ఆధ్వర్యంలో త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు.
సిఎస్ఐ సంస్థ కూడా ప్రభుత్వసెమి సంస్థని అని గతంలో మెడికల్ కాలేజీ ఉండే దానిని పునరుద్ధరింపజేసి ఆధునిక హంగులతో ఇంకొక మెడికల్ కాలేజీను అందుబాటులోకి తెస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. నిజామాబాద్ కు ప్రభుత్వ మహిళ కాలేజీ మరియు స్పోర్ట్స్ స్టేడియం మరియు డిచ్పల్లి నందు ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కు ప్రయత్నాలు జరుగుతున్నాయని తన హయాంలో తప్పక ఈ మూడింటిని సాధించి ఓపెనింగ్ చేపిస్తామని తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీస్ కై కమిటీ వేయడం జరిగిందని 40 కోట్లు విడుదల చేశామన్నారు అది ప్రాసెస్ లో ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా పసుపు వరి పంటలకు ప్రసిద్ధి చెందినదని వాటికి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు పై గతంలో నమ్మకము అభిమానం ఉండే ఇప్పుడు అది కూడా కోల్పోయాడని తెలియజేశారు. 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎంత రుణమాఫీ చేసిందో దానికంటే పది రేట్లు అధికంగా మేము 9 నెలల్లోనే 18వేల కోట్లు ఆగస్టు 15 వరకు రైతులకు అందజేశామన్నారు. దేశంలో రైతుల రుణమాఫిశేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాష్ట్ర పగ్గాలు చేపట్టినప్పుడు కెసిఆర్ ఏడున్నర లక్షల కోట్ల అప్పు చూపించాడని దానికి 12వేల కోట్ల వడ్డీ ప్రతినెల చెల్లిస్తున్నామని తెలిపారు. అటువంటి చెల్లిస్తూనే ఇటు అభివృద్ధి సంక్షేమంపై వైపు పరుగులు తీస్తున్నామన్నారు. కేటీఆర్ హరీష్ రావు రోజుకు అబద్దం మాట్లాడడంలో నిష్ణాత్ములని తెలిపారు. వారి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తప్పక తన హయాంలో కేటాయించేలా 100% కృషి చేసి ఇప్పించే బాధ్యత తనది అని చెప్పారు. గతంలో హైదరాబాద్ సిటీ రాక్స్ లేక్స్ కుంటలు చెరువులు మధ్యలో ఉండేదని అప్పటి నిజాం పరిపాలన దాక్షకుడని 100 ఏండ్ల ముందు చూపుతో కుంటలు చెరువులు హైదరాబాదులో నిర్మించార ని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ టిఆర్ఎస్ మొత్తం కుంటలను చెరువుల భూములను గుడుల భూములను ఆక్రమించుకొని వారి లీడర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారము నడిపించారని దాని పర్యవసానమే వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ అంతా నీటిమయం అయితుందన్నారు. 1908 సంవత్సరంలో హైదరాబాద్ జనాభా 78,000 ఉండేదని అప్పుడు భారీ వర్షాల కారణంగా 18,000 మంది కొట్టుకుపోయారని తెలిపారు. హైడ్రాకు తన మన అనే భేదం లేదని దాని పని అది చేసుకోపోతుందన్నారు. ముచ్చర్ల లో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేయాలని లక్ష యాభై వేల కోట్లతో అంచనా వేయడం జరిగిందన్నారు. మూసి ప్రక్షాళన పనులకు శ్రీకారం చుట్టామన్నారు దానిని కేటీఆర్ హరీష్ రావులు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. 18 వేల పేదలకు ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ లను ముస్తాబు చేసి అందిస్తున్నామన్నారు. గతంలో టిఆర్ఎస్ సమయంలో డబుల్ బెడ్ రూమ్ లను సగంలోనే వదిలేసి వెళ్లిపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వము స్పోర్ట్స్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని అందులో భాగంగానే నిజామాబాద్ నిఖిత్ జరిన్ కు డిఎస్పి పదవి ఇచ్చామని తెలిపారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్లో మరియు కూల్చేసిన కలక్టరేట్ అంతా స్పోర్ట్స్ స్టేడియంగా మార్చేందుకు ప్రపోజల్సు పంపామని అన్నారు. నిజామాబాద్ కేంద్రంగా ప్రభుత్వ మహిళా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలకు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. కాంగ్రెస్ లో పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని అందులో భాగంగానే అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులకు కార్పొరేషన్ పదవులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారని చెప్పారని తెలిపారు. రాబోవు సర్పంచ్ జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలలో 100% పైగా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని దానికై ప్రతి చిన్న కార్యకర్త నుండి పెద్ద నాయకుడి వరకు ఇప్పటినుండే నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంత్రివర్గంలో జిల్లాకు తప్పకుండా ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. కేటీఆర్ ఆధ్వర్యంలో దుబాయ్ కేంద్రంగా సోషల్ మీడియాను నడుపుతూ అన్ని వక్రీకరిస్తూ మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో విడుదల చేయడం సిగ్గు చేటు అన్నారు. బాసర త్రిబుల్ ఐటీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్నారు. నిజామాబాద్ కు స్మార్ట్ సిటీ రావాలి కానీ కరీంనగర్ కు ఇచ్చారని ఇది అప్పటి రాష్ట్ర నాయకుల తప్పిదమే అని అన్నారు. 1939లో నిజామాబాద్ మున్సిపాలిటీ ఏర్పడిందని జనాభాపరంగా కూడా కరీంనగర్ కంటే నిజాంబాద్ అధికంగా ఉన్నదన్నారు.