*ఉత్సాహంగా కొనసాగుతున్న సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ* *ఈరోజు కామారెడ్డి నిజామాబాదు జిల్లా కేంద్రాల్లో కొనసాగిన టార్చ్ రిలే ర్యాలీ* *పాల్గొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంతర్జాతీయ బాక్సర్హుసముద్దీన్*
నిజామాబాద్ అక్టోబర్ 5:(నిఘానేత్రం ప్రతినిధి)మారుమూల ప్రాంతాల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసి వారిని ఛాంపియన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 20 24 విజయవంతం చేయడానికి పల్లె పట్టణ క్రీడాకారులను భాగస్వామ్యం చేయడానికి సంకల్పించిన టార్చ్ రిలే ర్యాలీ ఈరోజు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లో క్రీడాకారులు యువకుల ఉత్సాహాలు కేరింతల మధ్య కొనసాగింది. యువకులు క్రీడాకారులు స్వచ్ఛందంగా తరలివచ్చి జాతీయ జెండాలు చేపట్టి ర్యాలీలో పాల్గొంటున్నారు.
ఈరోజు కామారెడ్డి లో జరిగిన
కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగవన్ ప్రారంభించారు
అనంతరం
నిజామాబాదులో జరిగిన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, అర్జున అవార్డు గ్రహీత బాక్సర్ హుస ముద్దీన్ పలువురు క్రీడా సంఘ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు