*ఈనెల 12వ తేదీ నుంచి నడవనున్న కాజీపేట – దాదర్ రైలు* *రైలు నడపాలని రైల్వే మంత్రి,అధికారులను పలుమార్లు కోరిన ఎంపీ అర్వింద్* *ఇటీవల అతి త్వరలో రైలు అందుబాటులో వస్తుందని ఎంపీ కి తెలిపిన మంత్రి అశ్విని వైష్ణవ్* *హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు*
నిజామాబాద్ అక్టోబర్ 8:(నిఘానేత్రం ప్రతినిధి)గత తొమ్మిది నెలల నుండి అయోధ్య ప్రయాణికుల కోసం రద్దు చేయబడ్డ కాజీపేట – దాదర్ (07195/96) రైలు ఎట్టకేలకు మళ్లీ పట్టాలెక్కనుంది. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ లోని జగిత్యాల, కోరుట్ల,మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ ప్రాంతాల నుండి వివిధ పనుల అవసరాలకు ముంబై వెళ్లనున్న ప్రయాణికుల బాధలు తప్పనున్నాయి. గత తొమ్మిది నెలల క్రితం అయోధ్య కొరకు రద్దు చేయబడ్డ ఈ రైలు నడపాలన్న డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది . ఇట్టి రైలును పునరుద్ధరించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ రైల్వే మంత్రిని అశ్విని వైష్ణవ్ ను, ఉన్నతాధికారులను పలుమార్లు కోరిన సంగతి తెలిసిందే . గత 15 రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎంపీ అర్వింద్ మరో మారు రైల్వే మంత్రిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో రైలు ప్రారంభించేలా తగిన చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. అట్టి భేటీలోనే అది కొద్ది రోజుల్లో ఈ రైలు పున ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
దానికనుగుణంగా రైల్వే ఉన్నతాధికారులు కాజీపేట -దాదర్ (07195/96) రైలును మొదట నవంబర్ 28వ తారీకు వరకు పొడిగించారు. విషయం తెలుసుకున్న అర్వింద్ ఈ రైలును నిరంతరం రెగ్యులర్ ట్రైన్ గా నడిపించాల్సిందేనని రైల్వే అధికారులను పట్టుపట్టారు. దీంతో ఎంపీ అర్వింద్ కోరిక మేరకు ఈ రైలు జనవరి 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు రైల్వే అధికారులు తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. తాజా ఉత్తర్వుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ అర్వింద్ కు ధన్యవాదాలు తెలిపారు.