*కష్టాలు ఎన్ని వచ్చినా కలత చెందక కాంగ్రెస్ నే నమ్ముకొని ముందుకు నడిచినందుకే ఈ అద్భుత అవకాశం* *గత 35 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం* *సౌమ్యంగా ఉంటూ అందరి మన్నలను పొంది ఉన్నత స్థాయికి ఎదగలిగాడు* *వేనన్నగా పట్టణ అధ్యక్షుడిగా కాంగ్రెస్ కార్యకర్తల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యువ నాయకుడు*
నిజామాబాద్ అక్టోబర్ 11:(నిఘానేత్రం ప్రతినిధి) గత 35 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ చిన్న కార్యకర్తగా డి శ్రీనివాస్ తో ప్రయాణము మొదలుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ ఇంత స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి పట్టుదల నిబద్ధత ఉంది. ఎలాంటి పదవి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ లో తనకంటూ వేనన్న అనే ఒక ముద్ర వేసుకొని బ్రాండ్ గా మారాడు. పట్టణ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి తన వంతు ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. గత పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా నిరాశ చెందక ముందుకు కొనసాగాడు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదని అందరూ అనుకున్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ముందుకు కొనసాగడం జరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు షబ్బీర్ అలీ గెలుపు కొరకు ముమ్మర ప్రయత్నం చేసినప్పటికీ విజయం సాధించలేకపోయినా రాష్ట్రంలో అధికారంలో రావడానికి తన వంతు ప్రయత్నం చేశారు. జిల్లాలో ఉన్న పెద్ద నాయకులతో మంచి సంబంధాలను ఏర్పరచుకొని కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా మంచి అనుబంధం సంపాదించుకొని తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకొని ముందుకు నడవడం ఎంతో కలిసి వచ్చింది. అనుకోకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లో రావడం తో ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు నుడా చైర్మన్ ఉన్నత పదవి తనకు లభించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ పదవి నాకు రావడానికి జిల్లా ముఖ్య నాయకులు ఎంతో కృషి చేశారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు