Politics

*ఆలయ్- బలయ్ కార్యక్రమానికి వెళ్లిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్* *మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు బండారు దత్తాత్రేయ సంతోషాన్ని వ్యక్తపరిచారు* *పార్టీలకు అతీతంగా జరిపే అద్భుత సమ్మేళనంమే. ఈ ఆలయ్- బలయ్ కార్యక్రమం*

హైదరాబాద్ అక్టోబర్ 13:(నిఘానేత్రం ప్రతినిధి) ఆలయ్- బలయ్ ఒక సాంస్కృతిక కార్యక్రమం ఈ కార్యక్రమం గత 19 సంవత్సరాల నుండి అన్ని పార్టీలను ఒక తాటిపై తీసుకొని తెలంగాణ పోరాట సమయంలో ప్రారంభించడం జరిగింది. ఆలయ్- బలయ్ రాజకీయ కార్యక్రమం కాదు అన్ని పార్టీలను కలుపుకొని గతంలో ప్రారంభించిన కార్యక్రమం. పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇతర పార్టీ నాయకులు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు సంతోషాన్ని బండారు దత్తాత్రేయ వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం అద్భుతంగా జరగడానికి అందరి సహాయ సహకారాలు ఎంతగానో ఉన్నాయి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంతకంటే అద్భుతంగా జరుపుకునే విధంగా అందరూ సహకరించాలని అందరినీ కోరారు. అన్ని పార్టీల నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button