Politics
*డివిజన్ సమస్యలపై ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణను సుంకరి రాజశేఖర్ కాలనీవాసులు* *సానుకూలంగా స్పందించిన ధన్పాల్ సూర్యనారాయణ*
నిజామాబాద్: (నిఘానేత్రం టౌన్)
నిజామాబాద్ నగరంలోని 27వ డివిజన్ లో రోడ్లు, డ్రైనేజీ ల పరిస్థితి దారుణ స్థితిలో ఉన్నాయి. ఇట్టి సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించింది. ఇట్టి సమస్యల పరిష్కారం కోసం డివిజన్ బిజెపి నాయకుడు సుంకరి రాజశేఖర్ ఆధ్వర్యంలో బ్యాంకు కాలనీ ప్రజలు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణను కలిసి వినతిపత్రం అందించారు. డివిజన్ సమస్యలను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డివిజన్ సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. డివిజన్ సమస్యల పరిష్కారం కొరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని సుంకరి రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకరి రాములు,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.