*నిబంధనలకు విరుద్ధంగా సన్ ఫ్లవర్ హై స్కూల్* *జీవో వన్ ప్రకారము సన్ ఫ్లవర్ స్కూల్ లేదు* *ప్లే గ్రౌండ్ లేకుండా స్కూల్ నిర్వహణ* *ఎల్ కే జీ నుండి పదవ తరగతి వరకు ఉన్న స్కూల్లో మూత్రశాలలు మరుగుదొడ్లు రెండే ఉన్నాయి* *ఒక మూత్రశాలకు డోరే లేదు రెండో మూత్రశాలకు లోపల నుండి గొల్లెము లేదు* **వేలల్లో ఫీజు వసతులు శూన్యం*
నిజామాబాద్ నవంబర్ 2:(నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ నగర నడిబొడ్డున తిరుమల టాకీస్ చౌరస్తా లో గల సన్ ఫ్లవర్ స్కూల్ గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఆ స్కూల్ మాత్రం జీ ఓ వన్ నిబంధనల ప్రకారము లేదు ఆ స్కూల్ పై గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు జిల్లా విద్యాశాఖకు చేరిన గతంలో వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేయడం ఆ స్కూల్ లోనే బుక్స్ డ్రెస్సులు ప్రతి సంవత్సరం తీసుకోవాలి. వాటి ద్వారా కూడా స్కూలు యజమాన్యం లక్షల్లో సంపాదిస్తున్నారు వీటిపై విద్యాశాఖ నియంత్రణ లేకుండా పోయింది. నిబంధనల ప్రకారము ప్రతి స్కూలుకు ప్లే గ్రౌండ్ ఉండాలి కానీ సన్ ఫ్లవర్ స్కూల్లో ప్లే గ్రౌండ్ లేదు విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు లేవు. ఉన్న రెండు మూత్రశాలలు ఒక వాటికి తలుపు లేదు రెండోవాటికి లోబడి నుండి గొల్లెము లేదు. మలమూత్ర విసర్జన కొరకు అమ్మాయిలు ఎంతో ఇబ్బందికి గురి అవుతున్నారు ఒక అమ్మాయి వాష్ రూమ్ కి వెళ్లాలంటే ఇంకో అమ్మాయి అక్కడ బయట కావలి కాయ వలసిందే. లేకుంటే ఎవరు వచ్చి ఆ గొల్లెము లేని డోరు తెరుస్తారో అని భయంతో వాష్ రూమ్ కు వెళ్లడం జరుగుతుంది. ఒక్కో క్లాస్ రూమ్ లో అధిక సంఖ్యలో పిల్లలను ఉన్నట్టు సమాచారం. ఇంత పెద్ద సంఖ్య ఉన్న స్కూల్లో మలమూత్ర విసర్జన కొరకు వాష్ రూమ్ లు రెండే ఉండడం విద్యార్థులకు ఎంతో ఇబ్బంది అవుతుందని తెలియపరిచారు. ఎవరైనా ఫీజు కట్టకుంటే వారికి 50 నుంచి 100 గుంజీలు తీయించడం అతి దారుణమైన పనిష్ మెంట్ ఇయ్యడం వారి ఇంటికి ఫోన్ చేసి బెదిరించడం పిల్లల ముందు అవమానపరచడము దౌర్జన్యం చేయడము సన్ ఫ్లవర్ హై స్కూల్ యజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే వస్తుంది అని సమాచారం. ఇలాంటి స్కూల్ లపై చర్య చేసుకోవలసిన జిల్లా విద్యాశాఖ అధికారులు ఎందుకు చూసి చూడనట్టు ప్రవర్తిస్తున్నారు వారికే తెలియాలి. లేదా అధికారులకు యజమానియానికి లోపాయి కారి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా అందుకే ఆ స్కూల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదేమో అని ప్రజలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు ఇటికాల సంతోష్ వాళ్ళ పిల్లలను ఇబ్బంది పెట్టి ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాపియ్యకుండా స్కూల్ కు రావద్దని స్కూలుకు వెళ్తే దౌర్జన్యంగా గెంటివేశారు అని ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. స్కూల్లో ముగ్గురు పిల్లలను చేర్పించినప్పుడు పుస్తకాలకు బుక్కులకు స్కూల్ డ్రెస్ లకు 35 వేల రూపాయలు చెల్లించడం జరిగిందని ఫిర్యాదులో తెలిపారు. స్కూల్ కు పిల్లలను రానీయకపోవడం వలన వారు మనోవేదనకు గురై బాధపడుతూ విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు భావితరానికి మంచి విద్యావంతులను తయారు చేయవలసిన విద్యాసంస్థలు తమ సొంత లాభాలే ధ్యేయంగా పెట్టుకొని పేద విద్యార్థులను అణచివేస్తున్నారు. అలాంటి పేద పిల్లలను విద్యాశాఖ ఆదుకోవాలని పేద విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు