*మహాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్*
*
నిజామాబాద్ నవంబర్ 3:(నిఘానేత్రం ప్రతినిధి)
అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుంటే శబరి ఆలయాన్ని దర్శించుకున్న అనుభూతీ భక్తులకు కల్గుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం ఈ మహాన్నదాన కార్యక్రమం 80 రోజులపాటు
కంటేశ్వర్ అయ్యప్ప ఆలయంలో ఇందూర్ అయ్యప్ప సేవ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాన్నదాన కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
మొదట అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అయ్యప్ప స్వాములకు బిక్ష వడ్డీంచారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అయ్యప్ప మాల అంటేనే నిగ్రహానికి నిదర్శనం అని, కామ, క్రోధ, మదమత్సర్యాలను పంచఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం అన్నారు.ఇందూర్ నగరంలో ఉన్న అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుంటే శబరిలో ఉన్న అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్న అనుభూతిని భక్తులు పొందుతారని అని అన్నారు, ఇందూర్ లో దాదాపు 30 ఏళ్ల నుండి మాల దరిస్తున్న గుండమయ్య లాంటి గురు స్వాములు ఉన్నారని ఇందూర్ ఆలయ నిర్మాణానికి వారు ఎంతో కృషి చేసారన్నారు. జనవరి 20 వరకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఇందూర్ అయ్యప్ప సేవ సమితి ట్రస్ట్ ను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భక్తవత్సలం ఢిల్లీ, ట్రస్ట్ సభ్యులు సురేష్, ఆగమయ్యా, జగన్ మోహన్,తదితరులు పాల్గొన్నారు.