*మున్సిపల్ కమిషనర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్ ను భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి తో పాటు పార్టీ కార్పొరేటర్లు కమీషనర్ ను మర్యాదపూర్వక కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు*
నిజామాబాద్ నవంబర్ 10:(నిఘానేత్రం ప్రతినిధి)నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి , భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లతో కలిసి మర్యాద పూర్వకంగా భేటీ అయి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కార్పోరేటర్లంతా సహకరిస్తామన్నారు. డివిజన్లలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్లలో వీధి దీపాలు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, గత కమిషనర్ ప్రతీ డివిజన్ కి తాత్కాలికంగా 25 చొప్పున వీధి దీపాలు అందజేస్తామని తెలిపారని, కావున అది అమలయ్యేలా చొరవ చూపాలన్నారు. అంతేకాకుండా డివిజన్ కి 25 లక్షల చొప్పున ఫండ్ కేటాయించాలని, కౌన్సిల్ సమావేశాన్ని త్వరగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి వెంట డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలం రాజు, కార్పొరేటర్ పంచ రెడ్డి ప్రవళిక, భాజపా నాయకులు ఇప్పకాయల కిషోర్, పంచ రెడ్డి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.