*ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి* *DM&HO రాజశ్రీ* *పిల్లలకు చాక్లెట్లు కూల్ డ్రింలు తినకుండా తాగకుండా చూడాలి* *గృహినిలు ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి*
నిజామాబాద్ నవంబర్ 13(నిఘానేత్రం ప్రతినిధి)
నిజామాబాద్ నగర జిల్లా ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని DM&HO రాజశ్రీ తెలిపారు. పిల్లలలో వ్యాధులు డేంగి మలేరియా జ్వరాలు వ్యాపిస్తున్నాయని, గృహనిలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎప్పుడూ కాచి వడబెట్టిన నీటిని త్రాగాలని సూచించారు. పిల్లలు విద్యార్థులు రోడ్డుపై అమ్మే వస్తువులను కొనుక్కోవద్దని చాక్లెట్లు తినవద్దని, కూల్ డ్రింక్స్ తాగవద్దని దీనివలన జ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వేడి వేడి ఆహారంనే భుజించాలని తెలిపారు. ఇంటి ముందు నీటిని నిలువ ఉంచకూడదని నిల్వ ఉంచితే దోమలు ప్రబలి వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని బయట వస్తువులు ఏమి తినవద్దని సూచించాలని, స్కూలు నుండి ఇంటికి రాగానే పిల్లలకు కాళ్లు చేతులు ముఖము సబ్బుతో కడుక్కోవాలని లేదా మీరే కడగాలని సూచించారు.