Politics

*దైనందిన జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలి* *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* *ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం*

నిజామాబాద్, నవంబర్ 16 :(నిఘానేత్రం ప్రతినిధి) ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగంగా మల్చుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని అన్నారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ మాస్టర్స్ బాడ్మింటన్ టోర్నమెంట్-2024 క్రీడా పోటీలు ప్రారంభం అయ్యాయి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనునిత్యం దైనందిన కార్యకలాపాలలో నిమగ్నమై ఉండే వివిధ వర్గాల వారికి మానసికోల్లాసానికి అందించేందుకు క్రీడలు ఉపకరిస్తాయని అన్నారు. ఈ దిశగా ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహిస్తుండడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. నేటి తరం ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ క్రీడలు, వ్యాయామాలు, యోగా వంటి అభిరుచులను అలవర్చుకుంటున్నారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. ఆఫీసర్స్ క్లబ్ లో సభ్యత్వం అంటేనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించబడుతుందని, దీని ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆఫీసర్స్ క్లబ్ అభివృద్ధికి తనవంతు తోడ్పాటును అందిస్తానని అన్నారు.

రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ, క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కాగా, నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ కు స్విమ్మింగ్ పూల్ మంజూరు చేయించేందుకు జిల్లా యంత్రాంగం తరపున ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ను కోరగా, జిల్లా పాలనాధికారి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా టీజీవోల సంఘం అధ్యక్షుడు అలుక కిషన్, ఆఫీసర్స్ క్లబ్ ప్రతినిధులు వెంకటరమణ, గంగాకిషన్, భక్తవత్సలం, రాంకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button