Politics
*నగర మేయర్ భర్త పై దాడి*
నిజామాబాద్ (దిగా నేత్రం ప్రతినిధి):
మేయర్ భర్త బిఆర్ఎస్ నాయకులు దండు చంద్రశేఖర్ పై దాడి సోమవారం సాయంత్రం నాగారం 80 క్వార్టర్స్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పదవ డివిజన్ ప్రాంతంలోని వాటర్ ప్లాంట్ వద్ద 80 క్వార్టర్స్ కు చెందిన ఆటో డ్రైవర్ అనే యువకుడు శేఖర్ పై దాడి చేశాడు 100 గజాల ప్లాట్ గురించి జగడ జరిగినట్లు సమాచారం. డ్రైవర్ షేక్ రసూల్ దండు శేఖర్ పై ముందుగా చేతితో దాడి చేసి తర్వాత ఆటోలో ఉన్న రాడ్ తీసుకొని వచ్చి తలపై బాధడంతో శేఖర్ కు తీవ్ర రక్తస్రావం జరిగింది. అతనిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ లో ఇంకా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని నార్త్ సిఐ తెలిపారు.