*ఆటో డ్రైవర్ చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు* *100 గజాల ప్లాట్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు* *మక్కల గోపాల్*
నిజామాబాద్ నవంబర్ 18:(నిఘానేత్రం ప్రతినిధి)బీ అర్ ఎస్ నాయకులు, నగర మేయర్ భర్త దండు చంద్ర శేఖర్ పై దాడి చేసిన వ్యక్తి ఆటో డ్రైవర్ రసూల్ (చక్రు) చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. కావాలని ఎవరో దాడి చేయించారు. అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయని మక్కల గోపాల్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాడి చేసిన వ్యక్తికి
అతనికి సంబంధించిన ల్యాండ్ కు గాని, ప్లాట్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో గిట్టని వారు కుట్ర చేయించారని, రెండు లక్షలు డిమాండ్ అనే విషయం సరి అయింది కాదని అన్నారు. 100 గజాల ప్లాట్ విషయంలో ఎప్పుడు నన్ను సంప్రదించింది లేదని, 15 ఏళ్ల నుంచి మేము అతన్ని ఇబ్బంది పెట్టి ఉంటే, ఒకవేళ అతని ప్లాటును మేము ఆక్రమించి ఉంటే పోలీస్ స్టేషన్ లో గాని, జిల్లా సంబంధిత అధికారుల దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదని అన్నారు. ఎవరు కుట్రపూరితంగా అతనిని పంపించారని అర్థమవుతుందని,
దండు శేఖర్ పై దాడి కి యత్నం చేసిన వ్యక్తి పై, అతనికి సహకరించిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.