Politics

స్మార్ట్ లైబ్రరీ ఇనిషియేటివ్’’ప్రారంభోత్సవానికి కలెక్టర్

నిఘా నేత్రం, నవంబర్ 26:( రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్) మండలం లోని పద్మశాలిపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘‘ది స్మార్ట్ లైబ్రరీ ఇనిషియేటివ్’’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ పాఠశాలకు గ్రందాలయం ఏర్పాటులు తోడ్పటను అందించిన కుమారి అథిరీ రోజ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియాజేశారు. చిన్న వయస్సులో అథిరై రోజ్ పుస్తకాలను పలువురు విద్యార్థులకు అందించాలనే ఆలోచన రావడం సంతోషమైనదని గుర్తు చేశారు. నేటి తరంలో ఒక పుస్తకం చదువుతున్నమంటే ఆ పుస్తకంలో ఆలోచన విధానన్ని కనుబరుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదబడం వల్ల మెరుగైన జ్ణానాన్ని సంపాదించుకోగలుగుతామన్నారు. విద్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు గర్వపడాలని, ప్రైవేటుకు దీటుగా విద్యబ్యాసంలో ప్రభుత్వ విద్యార్థులుగా మనం ముందున్నమని అన్నారు.

చదువు కోవాలి అని కొరిక గట్టిగా ఉంటే పోటి పడి చదవగలుగుతాం, ప్రతి ఒక్కరికి చదువే మార్గం, మంచి ఆలోచనలు మంచి లక్షణాలను విద్యార్థులు అలమర్చుకోవాలన్నారు. అథిరీ రోజ్ తన చిన్న పాటి ఆలోచనతో ’’తను ఎదగాలి తనతో పాటు ఇతరు లు విద్యారంగంలో ఎదగాలనే ఆలోచనతో‘‘ లైబ్రరీ నిర్వహించిడం బాగుందని, విద్యార్థిని విద్యార్థులు ఇలాంటి ఆలోచనతో ముందుకు రావడం వల్ల సమాజంలో మంచి గుర్తింపుతో కూడిన విద్యను అభ్యసించగలరన్నారు. పాఠశాలలో ఇప్పటి వరకు డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్లు, కనీస వసతులు, మెరుగైన ఇన్ప్రా స్ర్టక్చర్ మనకు అందుబాటులో ఉన్నాయి అని గుర్తు చేశారు. విద్యర్థుల ఎదుగుడలకు ముందుగా కావాల్సింది డిసిప్లేన్, ఈ యొక్క డిసిప్లేన్ ప్రతి విద్యర్థిని విద్యార్థులు అమర్చుకోవాలన్నారు.

చదివే సమయంలో మీ యొక్క లక్ష్యం చేరువ కావడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైన వాటిని ఎదురొకొంటూ ఉన్నత లక్ష్యానికి చేరుకోవాలన్నారు. ఇష్టంగా ఇష్టపడి చదువుతే.. ఎంతటి కష్టాన్నైన మరిచిపోయి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకుంటారని మరోసారి గుర్తు చేస్తున్నానన్నారు.

కార్యక్రమం ముందర కలెక్టర్ తో పాటు గ్రందాలయం దాత అథిరై రోజ్, నిర్మాన్ ఆర్గనైజేషన్ సిఇఓ మయూర్ పట్నాల్, ఎమ్మార్వో రాములు కలిసి జ్యోతి ప్రజ్వాలన చేశారు. అనంతరం కలెక్టర్ చేతులు మీదుగా నిర్వహించిన గ్రందాలయంను ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో ఉన్న డిజిటల్ క్లాస్ రూంలను, నిర్మాన్ ఫౌండేషన్ ద్వారా గతంలో అందించిన కంప్యూటర్ ల్యాబ్ ( డిజిటల్ సెంటర్) ను సందర్శించారు. విద్యార్థినిలు సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.

కార్యక్రమం ముగింపుకు ముందరా ప్రధానోప్యద్యాయులు, యం.ఇఓ, పాఠశాల టీచర్లు కలెక్టర్ నారాయణ రెడ్డి, అథిరై రోజ్, నిర్మాన్ పౌండేషన్ సిఇఓ లకు శాలువాలతో సత్కరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మార్వో బొమ్మ రాములు, యం.ఇఓ, ప్రధాన ఉపాద్యాయులు, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button