*విద్యార్థి జశ్విత్ రెడ్డి ఆకస్మిక మరణం బాధాకరం* *కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రజినీకాంత్*
*
నిజామాబాద్ డిసెంబర్ 1:(నిఘానేత్రం ప్రతినిధి) నవంబర్ 29 తేదీన అనారోగ్యం కారణంతో మృతి చెందిన 9వ తరగతి విద్యార్థి జశ్విత్ రెడ్డి మరణం తమ విద్యాసంస్థలకు బాధాకరమని,మా విద్యా
సంస్థలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించమని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రజినీకాంత్ స్పష్టం చేశారు.ఆదివారం ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ తమ విద్యాసంస్థలో చదువుకునే పిల్లల యోగక్షేమాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.విద్యార్థి జశ్విత్ రెడ్డి మృతి తమ విద్యాసంస్థకు, తల్లిదండ్రులకు బాధాకరమని,ఇట్టి ఘటనపై పోలీసులు పూర్తి వివరాలను సేకరించారని, ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని,దర్యాప్తులో భాగంగా తమ పూర్తి సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. వారం రోజులుగా విద్యార్థి ఆరోగ్యం బాగోలేదని కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. విద్యార్థి ముందు రోజు కూడా యాక్టివ్ గా పాఠశాలలో తిరిగాడని,వాలీబాల్ కూడా ఆడాడన్నారు. ముందు రోజు వాంతులు రావడంతో తమ వార్డెన్ ప్రథమ చికిత్స చేయించారని తెలిపారు. మృతి చెందిన రోజు కూడా తమ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెల్లడానికి వెళ్లగా తల్లిదండ్రులు వచ్చిన తర్వాతే వెళ్తానని విద్యార్థి చెప్పాడని వివరించారు. విద్యార్థి తల్లిదండ్రులు వచ్చాక వారి కారులోనే ప్రతిభ హాస్పిటల్ కి తీసుకెళ్లామని,హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. రెండు రోజులుగా విద్యార్థి పాఠశాలలో ఉన్న సమయంలో జరిగిన పరిణామలపై పూర్తి సీసీ ఫుటేజ్ ను మీడియాకు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.తమ విద్యాసంస్థల పైన తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని తెలిపారు.