Politics

ఇబ్బందుల్లో రోగులు సంబరాల్లో వైద్యులు భార్యను ఏడంతస్తుల మేడ మీదకి మోసుకెళ్లిన భర్త.

నిజామాబాద్ జనవరి 11:( నిఘానేత్రం ప్రతినిధి)ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో రోగులు ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జన్మదిన సంబరాల మీద ఉన్న శ్రద్ధ వైద్య సేవలపై లేకపోవడం రోగులకు శాపంగా మారింది. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిర్మించారు. కానీ ఇక్కడ వైద్య సేవలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు స్ట్రక్చర్స్ లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళకు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో శుక్రవారం రాత్రి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో స్ట్రక్చర్, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆరుబయటే అరగంట సేపు నరకయాతన అనుభవించింది. పరిస్థితి విషమిస్తున్న సిబ్బంది కానీ వైద్యాధికారులు గాని స్పందించకపోవడంతో లక్ష్మి భర్త నే వార్డ్ బాయ్ అవతారం ఎత్తాడు.. తన భార్య నరకయాతన చూడలేక తన భుజాలపై ఆమెను ఎత్తుకొని ఏడంతస్తుల మేడ పైకి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఆసుపత్రి సూపరి oటెండెంట్ కు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో

. ఆమె నిర్లక్ష్యానికి నిలువుటద్దం గా మారింది.. ఒకవైపు ఆసుపత్రిలో రోగులు అవస్థలు పడుతుంటే మరోవైపు సూపరిoటెండెంట్ జన్మదిన వేడుకలు వైభవంగా జరుపుకోవడం పై సర్వత్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా పూర్తిస్థాయి సూపరిoటెండెంట్ లేకపోవడంతో ఇంచార్జి పాలనతో పర్యవేక్షణ కొరబడింది. రోగులకు సంబంధించి లిప్ట్ సరిగా పనిచేయక, బాత్రూంలు అస్తవ్యస్తంగా తయారై రోజుల తరబడి తాళాలు వేసి ఉంచిన పరిస్థితి నెలకొంది. రోగులు అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నా యి.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు కరువయ్యాయి.సెలబ్రేషన్లకు మాత్రం ఆస్పత్రి నిలయంగా మారిందని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా పర్యటన సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి దుస్థితిని చూసి సూపరింటెండెంట్ పై మండిపడ్డారు. అయినా పరిస్థితులలో ఏలాంటి మార్పు లేకపోవడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

 

 

వివాదoలో జీజీహెచ్ సూపరి oటెండెంట్.

 

నిజాంబాద్ జిల్లా ఆస్పత్రి సూపరిoటెండెంట్ ప్రతి మారాజ్ వివాదంలో చిక్కుకున్నారు. తన చాంబర్ ను ప్రైవేట్ ఫంక్షన్ హాలుగా మార్చి బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదంగా మారింది. వార్డులో సిబ్బంది లేక రోగులు ఇబ్బంది పడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button