
*పట్టభద్రులు వివేకంతో వేయవలసిన అమూల్యమైన ఓటు* *పట్టభద్రుల సమస్యలను పరిష్కరించగల పరిపూర్ణా అవగాహన కలిగిన వ్యక్తికే ఓటు వేయాలి* *పట్టభద్రుల ముసుగులో రాజకీయ రంగు పూసుకొని పట్టభద్రులను నట్టేట ముంచే వారికి ఓటు వేయద్దు అని పట్టభద్రుల ఆవేదన*
నిజామాబాద్ ఫిబ్రవరి 26:(నిఘానేత్రం ప్రతినిధి) చిన్నప్పటినుండి ఎన్నో ఆశలతో ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని పట్టభద్రులుగా పట్టా పుచ్చుకొని ప్రభుత్వ ఉద్యోగాలు లేక ఎవరికి తోచిన పని వారు చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్న పట్టభద్రులను ఆదుకోవాలని పట్టభద్రుల నుండి ఒకరు చట్టసభలకు వెళ్లాలని పట్టబద్రుల అమూల్యమైన ఓటు వేసే అవకాశం చట్టం కల్పించింది. ఈ పట్టభద్రల ఎన్నికలు రాజకీయ రంగు పూసుకుని విద్యావంతులను మేధావులను పట్టభద్రులను నట్టేట ముంచడానికి రాజకీయ చదరంగం నడుపుతూ డబ్బులను విచ్చలవిడిగా పంచుతు మాకు ఓటు వేయమంటే మాకు వేయమని రాజకీయ నాయకులు పోటాపోటీగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ఈ ఎన్నికలకు తేడా ఏమీ లేదని పట్టభద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గొంతుకను చట్టసభల్లో వినిపించే పట్టభద్రుడు గెలవాలని వారి జీవితాల్లో వెలుగు నింపాలని ఆశించే పట్టభద్రులకు ఆశాభంగం కలిగే విధంగా ఎన్నికలు జరుగుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో డబ్బు వ్యాపారాలు ఉన్నవారే ఎన్నికల రణరంగంలో రాజకీయ పార్టీల అండదండలతో గెలుపు పొందే విధంగా ప్రచారాలు చేస్తూ ముందుకు కొనసాగుతున్నారు. పేద పట్టబద్రులు ఎన్నికల రణరంగంలో నిల్చో కలిగిన. వారికి డబ్బు లేక స్తోమత లేక పలుకుబడి లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రచారాలు చేసిన వారికి ఓట్లు పడే అవకాశం తక్కువే ఉందని పట్టభద్రులు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో డబ్బున్న వాడిదే పై చేయి రాజకీయ అన్నదండలు ఉన్నవారే విజయ దుందుభి మోగిస్తారని ఆవేదన చెందడం తప్పితే మేము చేసేది ఏమీ లేదని తెలిసిన. అయినప్పటికీ మేధావి అయినా ప్రతి ఒక్క పట్టభద్రుడు ఆలోచించి పట్టభద్రులకు అండగా దండుగా నిలబడి నేనున్నానని ముందుకు నడిచే మంచి నాయకుడినే ఎంచుకొని ఓటు వేయాలని అతనిని గెలిపించుకోవాలని పట్టభద్రులు పట్టబద్రులను కోరుకుంటున్నారు